అద్దంలో చూసుకుంటే
అందంగా కనిపించాను
దిష్టి తగిలేనంటూ
మది మెటికలు విరిచింది
మురిపాల చిరునవ్వు
రాణివేనంటూ వంత పాడింది
అయినా
అనుమానం ఒకటి చేరింది
తికమక మాయాజాలం చుట్టుముట్టింది
ఏదో
రహస్యచర్చ జరుగినట్టుంది
యుద్ధభేరి మోగినట్టుంది
ఓహ్
తిరకాసు ఏదో జరిగినట్టు
మాట తీరు మారినట్టు
మడతపేచీ ఏదో ఉన్నట్టు
మాటిమాటికి అనిపిస్తూనే ఉంది
ఓయ్
ఇంతకూ...
ఆ వైపున ఉన్నది
నువ్వా ... నేనా
మడత పేచీ కథేదో
చెప్పి పోవోయ్